డెల్ ఆరంభ్ దృష్టిలో యూఎన్ వారి స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు అంటే ఏమిటి

 

సెప్టెంబర్ 2015 లో, స్థిరమైన అభివృద్ధి కొరకు యూఎన్ జనరల్ అసెంబ్లీ 17 స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలకు (ఎస్&zwjడీజీలు) ప్రాధాన్యత ఇస్తూ 2030 అజెండాను స్వీకరించింది. అన్ని దేశాలలో పేదరికం అంతంచేయుట, ఆరోగ్యం మరియు విద్యాభివృద్ధి, అసమానతల తగ్గుదల, ఆర్థికాభివృద్ధి మరియు వాతావరణ మార్పులను అధిగమించుటకు ఈ ఎస్&zwjడీజీలు పిలుపునిచ్చాయి.

ఈ ఎస్&zwjడీజీలలో, దేశాలు తన పౌరులకు జీవితాంతం అభ్యాస అవకాశాలను ప్రోత్సహించడముతోపాటు చేర్చబడిన మరియు న్యాయమైన విద్యను అందించుటను నిర్ధారించాలని లక్ష్యము 4 పేర్కొంటుంది.

 

 

ఈనాడు, వాతావరణ మార్పులు వంటి సమస్యలు ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకుంటున్న ఈ తరుణంలో మనం అన్ని విషయాల గురించి తెలుసుకొని ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది, దీని వలన మనం సరైన నైపుణ్యాలు, విలువలు మరియు ధోరణులు కలిగి ఉండవలసిన ఆవశ్యకత ఉంది. నాణ్యమైన విద్యాభ్యాసము ఆర్థికాభివృద్ధి, స్వావలంబనను పెంచుటకు మరియు మెరుగైన జీవనోపాధులను ఏర్పాటుచేయుటకు సహాయపడుతుంది.

ప్రస్తుత పరిస్థితిలో, కొత్త కొత్త సాంకేతిక ఆవిష్కరణలు వస్తున్నాయి. ఆన్లైన్ కోర్సులు మరియు ఇంటరాక్షన్ శిక్షణల ద్వారా డిజిటల్ ప్లాట్ఫార్మ్ వైపుకు విద్య కదులుతున్న కారణంగా ప్రతి ఒక్కరు ప్రాథమిక నైపుణ్యాలు కలిగి ఉండటం ముఖ్యం.

ప్రస్తుతము ఉన్న డిజిటల్ విభజనను పూరించుటకు, డెల్ టెక్నాలజీస్ మరియు యునెస్కో ఎంజీఐఈపీ వారు సంయుక్తంగా పాఠశాల ఉపాధ్యాయులకు కీలకమైన పీసీ నైపుణ్యాలను అందించుటకు చేతులు కలిపారు. ఈ భాగస్వామ్యము ద్వారా వారు నాణ్యమైన శిక్షణను ఉపాధ్యాయులకు అందిస్తారు, ఆ ఉపాధ్యాయులు పిల్లలలో శిక్షణ మరియు నైపుణ్యాలను ప్రోత్సహించగలుగుతారు.

డెల్ ఆరంభ్ మరియు యునెస్కో ఎంజీఐపీ వారి ‘ఫ్రేమర్&zwjస్పేస్’ ప్లాట్ఫార్మ్ గుర్తింపు పొందిన ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడములో సంయుక్తంగా కృషిచేస్తారు, తద్వారా విద్య యొక్క ఎస్&zwjడీజీ 4.7 అమలుకు పనిచేసి, శాంతియుతమైన మరియు స్థిరమైన సమాజ నిర్మాణానికి కృషి చేస్తారు.

ఉపాధ్యాయులు ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) లో డెల్ ఆరంభ్ ద్వారా అందించబడే స్ప్రింగ్&zwjబోర్డ్ ద్వారా డిజిటల్ శిక్షణ ప్రారంభం అవుతుంది. ఫ్రేమర్&zwjస్పేస్ ఉపాధ్యాయులకు కంటెంట్ క్రియేషన్ సామర్థ్యాన్ని మరియు విశ్లేషణాత్మక దృష్టి ధోరణిని అందించి విద్యాభ్యాసము యొక్క నాణ్యతను పెంచుటలో సహాయం చేస్తుంది.

AI-పవర్డ్ డిజిటల్ ప్లాట్ఫార్మ్ అయిన ఫ్రేమర్&zwjస్పేస్, ఉపాధ్యాయులు విద్యార్థుల కొరకు వ్యక్తిగతీకరించబడిన శిక్షణా ప్రణాళికలను తయారు చేయుటకు, అమలుచేయుటకు మరియు పర్యవేక్షించుటకు సహాయపడుతుంది. ఇది ఉపాధ్యాయులకు ఐసీటీ మరియు ఫ్రాంటియర్ సాంకేతికతల గురించిన పరిజ్ఞానాన్ని అందింస్తుంది, తద్వారా వారు విద్యార్థులు నాణ్యమైన విద్యను అందుకొనుటలో సహాయపడగలుగుతారు.

ఈ వ్యాప్తి మూడు దశలలో ఉంటుంది – ఉపాధ్యాయులు ఫ్రేమర్&zwjస్పేస్ ఉపయోగించుటకు శిక్షణ ఇవ్వడము, 200-గంటల శిక్షణ అందుకున్న ఉపాధ్యాయులకు ధృవీకరణ పత్రాలు అందజేయడము మరియు శిక్షణా ఫలితాలపై ప్రభావాన్ని అంచనావేయుట.

ఈ భాగస్వామ్యము ద్వారా, మేము విద్య యొక్క ఎస్&zwjడీజీ సాధించుటలో ముందుకు సాగగలమని మరియు ఇతరులకు డిజిటల్ శిక్షణను అందజేయగలిగే ఉపాధ్యాయుల సమూహాన్ని ఏర్పాటు చేయగలమని ఆశిస్తున్నాము.