మీరు కంప్యూటర్ని ఎందుకు ఉపయోగించాలి?
పని చేయడానికి
ఆన్లైన్లో బ్యాంకింగ్ కార్యకలాపాలకు
గేమ్స్ ఆడటం
ఒక మూవీని స్ట్రీమింగ్ చేయడానికి
మీ పిల్లలకు హోమ్ వర్క్‌లో సహాయపడటానికి
లేదా పైన పేర్కొన్నవన్నీనా?
చాలావరకు పైన పేర్కొన్నవాటన్నింటి కొరకు మనం కంప్యూటర్ ఉపయోగిస్తాం, మరిముఖ్యంగా మీ చిన్నపిల్లల కొరకు ఎక్కువగా ఉపయోగిస్తాం. చదువు కొరకు కంప్యూటర్ ప్రపంచం నుంచి 2018లో ఆశించే విషయాలు:
1. మీరు మరిన్ని మేకర్ ప్రదేశాలను చూడవచ్చు
2. క్లౌడ్ స్టోరేజీ అనేది ఒక ముఖ్యమైన మార్గం
క్లౌడ్ స్టోరేజీ అనేది మీ బిడ్డ ఇంటర్నెట్, కంప్యూటర్ మరియు ఇమెయిల్ ఐడిని యాక్సెస్ చేసుకునేంత వరకు ఎక్కడి నుంచి అయినా మీ డేటాను 24/7 యాక్సెస్ చేసుకోవచ్చు. Dropbox
[1], Google Drive
[2], One Drive
[3] - ఇలా అనేక ఆప్షన్లున్నాయి, వీటిని ఉపయోగించుకోవడం ఉచితం మరియు విశ్వసనీయమైనవి. క్లౌడ్ స్టోరేజీలో మొత్తం అభ్యసన మెటీరియల్‌ని కూడా ఒకే చోట ఉంచడం వల్ల, మీ బిడ్డ కష్టపడి రూపొందించిన డేటా పోకుండా సురక్షితంగా ఉంటుంది.
3. ఆటలు అనేవి నేర్చుకోవడానికి ఒక మార్గం
తరగతిగదిలో బట్టీపట్టేవిధానం నుంచి ప్రాక్టికల్ లెర్నింగ్ దిశగా మారుతున్న తరుణంలో, ఆటలు అనేవి పిల్లలు నేర్చుకోవడానికి అలానే తరగతి గదిలో వారికి బోధించిన భావనలను సమర్ధవంతమైన మరియు ఆస్వాదించే మార్గంలో నేర్చుకోవడానికి దోహదపడతాయి. ఆటలకు సంబంధించి అత్యుత్తమ భాగం ఏమిటంటే, అన్ని వయస్సు పిల్లల కొరకు విద్యతో వినోదాన్ని సంతులనం చేస్తుంది. ఇంగ్లిష్ పదబంధం పెంచుకోవడానికి ఆల్ఫాబెటిక్ బింగో, గణితం కొరకు లెస్ ద్యాన్ లేదా గ్రేటర్ ద్యాన్ మరియు జాగ్రఫీ కొరకు క్యాపిటల్స్ ఆఫ్ ద వరల్డ్ ఉపయోగపడతాయి. కంప్యూటర్‌పై మీరు ఎంత ఎక్కువగా చూస్తే, మీరు అంత ఎక్కువగా పొందుతారు.