స్క్రీన్ టైమ కి తల్లిదండ్రులు భయపడకూడదు

 

టివి
స్మార్ట్ ఫోన్లు
టాబ్లెట్(లు)
స్కూలులో పిసి
మరియు ఇంటి వద్ద పిసి

‘‘స్క్రీన్ టైమ్’’ అనేది ప్రతి చోట ఉంది. కేవలం మీ పిల్లలకే కాదు, మీ దైనందిన జీవితంలోనూ ఇది ఒక భాగమే!

కాబట్టి, స్క్రీన్ టైమ్ అంటే భయమెందుకు?

ఒక డిజిటల్ పెంపకదారుగా, మీ పిల్లలు తోటి విద్యార్థులతో సమంగా ఎదగడానికి మరియు వారికోసం దాచిన భవిష్యత్తుకి మీరు చేతులు చాచి పిసిని స్వాగతించడం మంచిది. మీరు స్క్రీన్ టైమ్ కి ఎందుకు భయపడకూడదో చెప్పడానికి ఇక్కడ మూడు కారణాలున్నాయి.

1) జీవితంలోకి పాఠ్య పుస్తకాలు

మీ చిన్నారి వయసు లేదా పాఠ్యాంశంతో నిమిత్తం లేకుండా జీవితంలోకి పిసి పాఠ్య పుస్తకాలు ప్రవేశిస్తాయి. ఇవి పాఠ్యాంశాన్ని నిజ జీవితంతో ముడిపెట్టుకోవడానికి మరియు చిరకాలం గుర్తు పెట్టుకోవడానికి సాయపడతాయి. వాతావరణ మార్పుల గురించి పాఠ్య పుస్తకంలో ఉన్నదానిని బిగ్గరగా చదవడంకంటే ఒక షార్ట్ ఫిలింని చూసినట్లయితే చాలా ప్రభావం ఉంటుంది మరియు కళ్లముందు కనిపిస్తుంది. మీ పిల్లల్లో మార్పును చూడడానికి దీనిని ఓసారి ప్రయత్నించండి.

2) ప్లేటైమ్ అనేది కేవలం ఆడుకునే సమయమే కాదు

స్కూలుకి వెళ్లడం, రోజంతా తరగతులు, ట్యూషన్లు, ఇతర వ్యాపకాలు, ఆటలు వగైరాలతో మీ చిన్నారి అలసిపోతారు- మర్నాటికి సిద్ధం కావాలంటే కొంత ఉల్లాసం అవసరం. ఒక గంటసేపు గేమింగ్ వల్ల మీ బిడ్డను వత్తిడి నుంచి దూరం చేస్తుంది. అలాగే, సమస్యలను పరిష్కరించుకునే నైపుణ్యంకూడా అలవడుతుంది. గేమింగ్ దృశ్య ప్రాధాన్యమైనదైనా లేక నేర్చుకునే ఆటయినా, మీ చిన్నారి కొత్త విషయాలను అలవరచుకోవడమే కాగలదు.

3) ఇది కుటుంబ సమయం, కూడా!

మీ బిడ్డ పిసి దగ్గర కూర్చోవడమంటే అది ఒంటరి చర్యగా భావించకూడదు, అది మీ కుటుంబ ఉమ్మడి చర్యలు. ఒక వీడియోని చూసి, దాని గురించి చర్చిస్తే, పిసిలో గడిపే సమయం మీ కుటుంబ సమయంగా మారిపోతుంది! మీరు చేయాల్సిందల్లా పిసిని అన్వేషించడానికి కాస్త సమయాన్ని వెచ్చించండి మరియు మీ కుటుంబానికి ఏది అనువైనదో చూడండి – ప్రతి ఒక్క వయసువారికి తగినట్లుగా ఉంది.

పిల్లలు పిసి మీద ఉన్న సమయంలో, ముఖ్యంగా తల్లిదండ్రుల పర్యవేక్షణ లేనప్పుడు దూరంగా ఉండడానికి అలవాటు పడతారు. పిసి సమయాన్ని ఉత్పాదకతగా మార్చడానికి అభ్యాస వనరులను ఎంచుకోవడానికి ముందే ఈ ప్రశ్నలను మీరు అడగండి. మీ పిల్లలు రేపటి రోజున సాంకేతిక-సమర్థతతో ఎదగడాన్ని గమనించండి.