పిసి లేదా పర్సనల్ కంప్యూటర్ అనేది మీ బిడ్డ యొక్క మొదటి అభ్యసన పరికరం ఎందుకు కాకూడదు?

తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు పిల్లలకు ముఖ్యమైన స్ఫూర్తిదాతలుగా నిలుస్తారు. చాలా తరచుగా పిల్లలు తమ తల్లిదండ్రులపై ఏకధాటిగా ప్రశ్నలు సంధిస్తూ వాటికి సమాధానాలు పొందడానికి ప్రయత్నిస్తుంటారు. [1].

స్ఫూర్తిదాతలు అనేవారు ఆధారపడదగిన వారైనప్పటికీ కూడా, వారికి కూడా కొన్ని పరిమితులుంటాయి. ఉదాహరణకు, తల్లిదండ్రులకు అన్నీ తెలియకపోవచ్చు, అదేవిధంగా టీచర్లు అన్నివేళలా అందుబాటులో ఉండరు. అన్నింటిని మించి, పిల్లల్లో రెస్పాన్స్ సిస్టమ్ చాలా సెలక్టివ్‌గా ఉంటుంది, విజువల్స్, ఆడియో మరియు కలర్స్‌కు వారు ఎక్కువ ప్రతిస్పందిస్తారు. [2]. ఇది మనం పిల్లల యొక్క అభ్యసన సామర్థ్యాన్ని అంతర్గతంగా గరిష్టం చేయాల్సిన ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. అటువంటి సమయాల్లో విశ్వసనీయమైన స్నేహితుడు- కంప్యూటర్ సమస్యలను నుంచి బయట పడేయడానికి ముందుకొస్తుంది.

‘‘తల్లిదండ్రులకు అన్నీ తెలియకపోవచ్చు, అదేవిధంగా టీచర్లు అన్నివేళలా అందుబాటులో ఉండరు.’’

పిల్లలు ప్రతిదీ కూడా నేర్చుకోవాల్సిన ఆసక్తి మరియు ఆతురతలో ఉంటారు. వారు ప్రపంచాన్ని అన్వేషించి, తమకు ఉండే అపార అవకాశాల గురించి నేర్చుకోవాలని కోరుకుంటారు. కంప్యూటర్ ద్వారా, పిల్లలు, ఇంటర్నెట్‌పై లభ్యం అయ్యే వివిధ రకాల విద్యావనరులను పొందవచ్చు.

అన్నింటిని మించి, మీ పిల్లవాడి యొక్క అభిజ్ఞా సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి దోహదపడుతుంది. కిండర్‌గార్టెన్ పిల్లలు కంప్యూటర్‌పై ఉన్నప్పుడు తమ 90% సమయంలో ఏదో ఒక పనిచేస్తూ ఉన్నట్లుగా 1993లో జరిపిన ఒక అధ్యయనంలోకనుగొన్నారు.

విజువల్స్ మరియు రంగులతో కూడిన ఇంటరాక్టివ్ పాఠాలు పిల్లవాడు మరింత మెరుగ్గా అర్థం చేసుకోవడం మరియు సమాచారాన్ని మరింత మెరుగ్గా గుర్తుంచుకునే సామర్థ్యాలను విస్త్రృతం చేస్తాయి. విద్యా కార్యక్రమాలు సమస్యా పరిష్కార నైపుణ్యాలను అభివృద్ధి చేస్తాయి, వినోదాత్మక కాన్సెప్ట్ ఆధారిత గేమ్‌లు పిల్లవాడి గ్రహణ శక్తిని మరియు గుర్తుంచుకునే శక్తిని గణనీయంగా పెంపొందిస్తాయని సైకలాలజీ టుడేలో  ప్రచురించబడ్డ ఒక కథనం స్పష్టం చేస్తుంది.

డగ్లస్ హెచ్, క్లెమెంట్స్ ప్రచురించిన “పిల్లలతో కంప్యూటర్‌ని సమర్థవంతంగా వినియోగించడం” వార్తా కథనంలో కంప్యూటర్ వల్ల పిల్లలకు కలిగే ప్రయోజనాలు పేర్కొనబడ్డాయి. , “చిన్నపిల్లలు సమస్యల్ని పరిష్కరించడం కొరకు గీయడం కొరకు మరియు జామెంట్రీ వంటి వాటిని చేయడం కొరకు కంప్యూటర్‌ని ఒక కొత్త రీతిలో ఉపయోగించడం వల్ల, గణితపరంగా మరియు శాస్త్రీయంగా నేర్చుకోవడానికి మరియు అభివృద్ధి చెందడానికి దోహదపడుతుంది’’ అని ఆయన అందులో పేర్కొన్నారు.

చాలామంది తల్లిదండ్రులు టాబ్లెట్‌లు మరియు ఇతర మొబైల్ పరికరాలను పిల్లలకు అందిస్తుంటారు, అయితే పిసి అందించే లీనమయ్యే మరియు స్పర్శాత్మక వాతావరణాన్ని అవి అందించలేకపోతాయి. పిల్లలకు మొబైల్ పరికరాలు ఎంతో సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ, రాతపూర్వకంగాను మరియు మౌఖికంగా వాక్యాలను రాయడం మరియు వ్యక్తీకరించడం తెలిసినప్పుడు, వారికి పిసిలను పరిచయం చేయడం తెలివైన విషయం, తద్వారా చదవడం మరియు రాయడం ద్వారా పిల్లల అభ్యసన ప్రోత్సహించబడుతుంది.

ఈ సాంకేతిక యుగంలో ముందుకు సాగడం కొరకు పిసి అనేది మీ బిడ్డ యొక్క అత్యంత ప్రాథమికమైన లేదా అత్యంత మౌలిక ప్రాథమిక ఉపకరణంగా ఉండటం అనేది ఎంతో ముఖ్యం. కొత్తమిలినియంలో సాధించబడ్డ అన్ని సాంకేతిక ఆవిష్కరణల్లో ఇది ముందున్నది మరియు మీ బిడ్డ భవిష్యత్తులో ఉపయోగించే ఏ పరికరానికైనా ఇది ఒక బలమైన పునాదిని ఏర్పరుస్తుంది.

గరిష్టంగా, సమర్థవంతంగా కంప్యూటర్‌ని ఉపయోగించుకోవడం అనేది మీ బిడ్డ ఎదుగుదల మరియు అభివృద్ధికి తొలి అడుగుగా నిలుస్తుంది. తన యొక్క సరికొత్త పిసితో కారణంగా ఎంతో స్పష్టంగా విద్యాపరమైన భావనలను అన్నింటిని నేర్చుకున్న నాసిక్‌కు చెందిన ప్రాథమికోన్నత పాఠశాలకు వెళ్లే శుభమ్ దీనికి చక్కటి ఉదాహరణగా నిలుస్తారు.

పిసి వల్ల బహుళ ప్రయోజనాలు ఉండటమే కాకుండా, తరచుగా తల్లిదండ్రులు మరియు టీచర్‌లకు ఇబ్బందిగా ఉండే, ఊహాత్మక మరియు వాస్తవిక ప్రపంచాల మధ్య అంతరాలను పూడ్చడానికి దోహదపడుతుంది. మీ బిడ్డ కొరకు పిసిని పొందడం అనేది దీర్ఘకాలంలో ఒక చక్కటి నిర్ణయంగా రుజువు అవుతుందనే విషయంలో ఎలాంటి సందేహం లేదు.