విద్యార్థులను మీరు ప్రేరేపించగలరు - ఎలాగో చూడండి

 

ప్రేరణ అనేది ప్రతి ఒక్కరికీ సులభంగా కలగదు. కొందరిలో ఈ లక్షణం ‘పుట్టుకతోనే’ ఉంటుంది. అధిక శాతం విద్యార్థులను మాత్రం ఎప్పటికప్పుడు నెడుతూ ఉండాలి. విద్యార్థి యొక్క సొంత లక్ష్యాల సాధనకు, అవి క్లాస్లో ప్రథమ శ్రేణి కావచ్చు, ఛాంపియన్షిప్ గెలవడం లేదా ఒక నిర్దిష్ట సబ్జెక్టులో మరింత అవగాహన పెంచుకోవడం కావచ్చు, ఎప్పటికప్పుడు ప్రోత్సాహపరచడమనేది గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. ఒక టీచర్గా మీరు క్లాస్ని ప్రేరేపితం చేయడానికి చేయాల్సినదేమిటో చూడండి :

1. మార్కులను చూపండి 

పని ప్రదేశాలలో ఎలాగైతే ప్రశంసలు మరియు పదోన్నతులతో ఉత్తేజితులవుతారో, అదే విధంగా విద్యార్థులుకూడా మార్కులు మరియు గ్రేడ్లతో ప్రేరణ పొందగలుగుతారు. నిరంతరం విద్యార్థులు ముందుకు సాగడానికి, వీలయినన్ని మాక్ పరీక్షలు నిర్వహించండి. దీనివల్ల విద్యార్థులు తమ వాస్తవ పరీక్షలకోసం పూర్తిగా సంసిద్ధులు కాగలుగుతారు.

2. పురోగతిని గుర్తించండి

విద్యార్థులు సాధించిన చిన్నపాటి అభివృద్ధినైనా గుర్తించగలగితే వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉదాహరణకు, ఒక విద్యార్థి ఇంగ్లిషు ఒకాబ్యులరీ పరీక్షలో 6/10 నుంచి 8.5/10 కి ఎదిగాడనుకుంటే, నేరుగా ‘వెల్ డన్’ అని ప్రశంసించడం లేదా ఒక స్టార్ స్టిక్కర్ ఇవ్వడం వంటివి ఎంతో ప్రేరణనిస్తాయి. ప్రశంసలు కురిపించడం మరియు ప్రోత్సహించడం వంటివన్నీ మీ సొంత శైలిపై ఆధారపడి ఉంటాయి.

3. క్రియాత్మకంగా నేర్చుకోవడమనేదే సరైన మార్గం

తరచు, తరగతి గదిలో ఎక్కువగా మాట్లాడేది టీచరే. దీనిని క్రియాత్మకంగా మార్చగలగాలి. Super Teacher Worksheets [1] వంటి బోధనా వనరులతో ఇంటరాక్టివ్ వీడియోలతో పరస్పరం చర్చించుకునేలా చూడడం లేదా గ్రూప్లు ఏర్పరచి చర్చలు నిర్వహంచడం మరియు ప్రోబ్లమ్-సాల్వింగ్ వర్క్షీట్లను ఇవ్వడం చేయాలి.

4. సామర్థ్యంపై నిర్మాణం

ఎవరైనా ఒక విద్యార్థి త్రిగుణమితిపై అభిరుచిని మరియు నిజమైన ఆసక్తిని కనబరుస్తున్నట్లయితే, అలాంటివారికి 100 Problems Challenge (100 సమస్యల సవాల్) [2] ఇవ్వండి. వారిలోని ఆసక్తిని ఒక ఇష్టంగా ఎలా మారుతుందో గమనించండి. అదే విధంగా, మీ విద్యార్థులలోని సమర్థతపై భవిష్య నిర్మాణం జరపడానికి పలు పిసి వనరులు అందుబాటులో ఉన్నాయి. ఇ:దుకుగాను మీరు విద్యార్థులలోని ఆసక్తులను గుర్తించేందుకు వారితో బాగా సాన్నిహిత్యంగా సంభాషించాలి. తద్వారా వారి ఎదుగుదలకు అవసరమయ్యే పిసి వనరులను వెదకడంలో సాయపడండి.

ఒకవేళ మీరు ఆపద్ధర్మ లేదా తొలిసారి టీచర్ అయినట్లయితే, మీకు సబ్జెక్టుపైగల ప్రావీణ్యం మరియు క్లాస్పట్ల మీకుగల అనురక్తితో పాటుగా పిసి అనేది ఒక అత్యవసర బోధనా ఉపకరణం. ఇది కేవలం విద్యార్థులకు మాత్రమే కాకుండా మీకుకూడా అభ్యసనా ఉపకరణమే!