మీ బిడ్డ మొదటి కంప్యూటర్ కొరకు మీకు అత్యావశ్యకమైన 5 పాయింట్ల చెక్ లిస్ట్

 

పని

ఆన్ లైన్ బ్యాంకింగ్

ట్యాక్సులు ఫైల్ చేయడం

సోషల్ మీడియా

చదవడం

రీసెర్చ్ చేయడం

కంప్యూటర్ ద్వారా మీ రోజువారీ జీవితంలో అనేక  ప్రయోజనాలుంటాయి.

అలానే మీ పిల్లవాడికి కూడా అనేక ప్రయోజనాలుంటాయి.

భవిష్యత్తతు వర్క్ ప్లేస్ కొరకు మీరు వారికి ఒక కంప్యూటర్ సిద్ధం చేయాల్సి ఉంటుంది.

వారి కొరకు మీరు సరైన కంప్యూటర్ ని ఎంచుకున్న తరువాత, మీరు చక్కటిగా దానిని ప్రారంభించాల్సి ఉంటుంది.

1) మంచి నిబంధనలు ఏర్పరచండి

మీ కంప్యూటర్ కు బలమైన పాస్ వర్డ్ ఏర్పాటు చేసి, దానిని వారితో పంచుకోండి, అలానే బాగా శోధించిన వెబ్ సైట్ ల బుక్ మార్క్ లు పంచుకోండి, కారణాన్నివివరించి కంప్యూటర్ ని రోజుకు గంట లేదా రెండు గంటలు మించి ఉపయోగించకుండా చూడండి.

2) చిన్నపాటి జాగ్రత్త తీసుకోవడం ద్వారా అధిక కాలం లబ్ధి కలుగుతుంది

కంప్యూటర్, దాని ఉపకరణాలు ఎంత సున్నితమైనదో మీ పిల్లలకు వివరించండి. వేడి నీటిని కీబోర్డుపై పోస్తే దానికి రిపేరింగ్ చేయాల్సి వస్తుంది వంటి ఉదాహరణల ద్వారా వీటిని వివరించండి. దీనిని వ్యక్తిగతంగా చేసుకోవడం ద్వారా, మీ బిడ్డ కంప్యూటర్ కు సంబంధించి మరిన్ని జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది.

3) క్లిష్టమైన కంప్యూటర్ వ్యవహారాలను కలిసి సాధించండి

కంప్యూటర్ ఎలా ఉపయోగించాలనే విషయం మీకు తెలిసినప్పటికీ, మీ కుటుంబం మొత్తం దానిలోని ప్రాధమిక విషయాలను తెలుసుకోవడం ద్వారా కంప్యూటర్ ని నిజంగా ఆస్వాదించవచ్చు. మొత్తం వాక్యం టైప్ చేయడం కొరకు మౌస్ ని సరైన స్థానంలో కదపడడం దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చు.

4) పిసి వనరులను జాబితా చేయడం

టీచర్లు, ఇతర తల్లిదండ్రులు సిఫారసు చేసిన మరియు ఆన్ లైన్ లోమంచి రివ్యులు ఉన్న కంప్యూటర్ వనరులు చెక్ చేయడానికి కొంత సమయం తీసుకోండి. తరువాత, వాటిని బ్రౌజర్ బుక్ మార్క్ చేయాలి, తద్వారా మీ బిడ్డ వాటిని ఉపయోగించడం, అలానే డెస్క్ టాప్ పై దానికి అనుగుణంగా షార్ట్ కట్ లు సృష్టించడం చేయవచ్చు.

5) వినోదానికి ప్రాధాన్యత ఇచ్చేలా చూడండి 

మీరు వినోదాన్ని పట్టించుకోకుండా విడిచిపెట్టలేరు. తాజాగా వైరల్ అవుతున్నది లేదా చక్కటి పిల్లి వీడియో వంటివాటిని వెంటనే చూడాలని మీ బిడ్డ కోరుకుంటాడు. అలానే మీ పిల్లలు తమకు ఉద్దేశించని వీడియోలు చూడకుండా జాగ్రత్త వహించండి. కంప్యూటర్ కు పేరెంటల్ కంట్రోల్ ఉంచడంతోపాటుగా లివింగ్ రూమ్ వంటి చోట్ల మీ పిసిని ఉంచండి.

మొత్తం కుటుంబం కూర్చుని కొత్త విషయాలను నేర్చుకోవచ్చు, హోమ్ వర్క్ చేయవచ్చు, అలానే వివిధ రకాల టాపిక్ లను చదువుకోవచ్చు. కంప్యూటర్ ని సరైన రీతిలో ఉపయోగించడం ద్వారా,  మీ బిడ్డలో ఉండే అభ్యసన సామర్ధ్యాన్ని పూర్తిగా వెలికి తీయవచ్చు.