పాజిటివ్ డిజిటల్ ఫుట్ ఫ్రింట్ సృష్టించడానికి మీ గైడ్

“మీరు ఆన్ లైన్ లో పోస్ట్ చేసేది మీ గురించి నిజంగా ఎంతో తెలియజేస్తుంది. ఉద్దేశ్యంతో పోస్ట్ చేయడం జాగ్రత్తగా రీపోస్ట్ చేయడం."

జర్మన్ కెంట్

 

ప్రతిఒక్కరికి డిజిటల్ ఫుట్ ప్రింట్ ఉంటుంది.

మీరు ఆన్ లైన్ లో ఏదైనా పోస్ట్ చేసినా లేదా ఏదైనా పంచుకున్నా, అది చిరకాలం ఉండే ఒక డిజిటల్ ఫుట్ ప్రింట్ ని సృష్టిస్తుంది. ఒక పాజిటివ్ డిజిటల్ ఫుట్ ప్రింట్ కొరకు మీరు చేయాల్సినవి ఇవిగో:

 

1. పాస్ వర్డ్ కీపర్ ని ఉపయోగించడం

సోషల్ మీడియాపై గోప్యతా సెట్టింగ్ లు, మీ పోస్ట్ లను మీ స్నేహితులు మరియు మిమ్మల్ని ఫాలో అయ్యే వారితా లేదా పబ్లిక్ తో పంచుకోవాలని మీరు నిర్ణయించుకోవడానికి అనుమతిస్తుంది. ఎలాంటి హ్యాకింగ్ జరగకుండా నిరోధించడానికి ఒక దృఢమైన, గుర్తుంచుకునే పాస్ వర్డ్ ని సృష్టించండి. 

 

2. ఎక్కువగా పంచుకోవద్దు.

ఆన్ లైన్ లో ఏదైనా పోస్ట్ చేయడం మరియు పంచుకునే విషయంలో జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఇది సానుకూల డిజిటల్ ఫుట్ ప్రింట్ కొరకు అత్యంత ముఖ్యమైన దశ. మీ ఆన్ లైన్ వ్యక్తిత్వం ఆధారంగా వ్యాఖ్యలకు ప్రతిస్పందించండి మీకు లాంటి ఐడియా లేని టాపిక్ ల్లో నిమగ్నం కావద్దు. మీరు ఆన్ లైన్ లో పోస్ట్ చేసే ప్రతిదాని గురించి గర్వపడాలి, ఒక్కసారి ఆన్ లైన్ లో వెళ్లిన తరువాత అది ఎప్పటికీ ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోండి.

 

3. మిమ్మల్ని మీరు వెతుక్కోండి

మీ పేరుపై ఒక సెర్చ్ చేయండి మరియు మీ గురించి ఏమి కనుగొనవచ్చో చూడండి. మీరు తెలుసుకున్న విషయాలకు మీరే ఆశ్చర్యపడవచ్చు. ఒకవేళ ప్రజలు చూడకూడని ఏదైనా మీరు చూసినట్లయితే, అప్పుడు తగిన అవసరమైన చర్యలు తీసుకోండి మరియు దానికి అనుగుణంగా తొలగించండి. ఒకవేళ ఏవైనా నకిలీ అకౌంట్ లు ఉన్నాయా అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తుంది...

 

4. పాత అకౌంట్ లను డిలీట్ చేయడం

పాత అకౌంట్ లను డీయాక్టివేట్ మరియు డిలీట్ చేయకపోవడం వల్ల కలిగే వ్యతిరేక ఫుట్ ఫ్రింట్ గురించి మనం చాలా విని ఉంటాం. మీరు మీ సోషల్ నెట్ వర్కింగ్ ప్రొఫైల్ ఉపయోగించడాన్ని నిలిపివేసినప్పుడు, ఆ నిర్ధిష్ట కంటెంట్ ఇక ఏమాత్రం లైవ్ లో లేని లేదా వెతికినప్పుడు లభించుకుండా ఉండేవిధంగా దానిని డీ యాక్టివేట్ చేయడం లేదా డిలిట్ చేసినట్లుగా ధృవీకరించుకోండి, ఇది ఖాతా హ్యాకింగ్ అయ్యే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 

 

సానుకూల డిజిటల్ ఫుట్ ప్రింట్ ఉండటం మంచి ఐడియా, ఎందుకంటే, మీ ఆన్ లైన్ గుర్తింపు మీ జీవితంలోని వివిధ రకాల భావనలను ప్రభావితం చేయగలదు. మీరు విద్యార్ధులు మరియు సమాజంపై ప్రనభావం చూపించగల వ్యక్తులు.  అందువల్ల, Mentor, మెరుగైన భవిష్యత్తు కొరకు మీ విద్యార్ధులకు స్ఫూర్తిని మరియు ప్రభావాన్ని కలిగిస్తుంది.