విద్యార్థులు చదవడాన్ని ప్రేమించేలా చేసే మీ మూడు దశల గైడ్

 

వీరు చదవడాన్ని బాగా ఇష్టపడతారు, అలానే కొంతమంది చదడాన్ని సాధ్యమైనంత వరకు పరిహరించేవిధంగా ఉటారు. టీచర్ గా మీకు తెలుసు, చదవడం అనేది అభ్యసనలో భాగం, దానిని ఏమాత్రం నిరాకరించలేం అని. వాస్తవానికి, పిల్లలు ఎంత త్వరగా చదవడం ప్రారంభిస్తే, వారికి అంత మంచిది. మంచి పుస్తకాలు చదవడం వల్ల మీ విద్యార్థుల స్వీయ రాత, ఒకాబులరీ మరియు భావనలను అర్ధం చేసుకోవడంపై గణనీయమైన ప్రభావం కనపరుస్తుంది. [1]

మీ విద్యార్ధులు చదవడాన్ని ప్రేమించేందుకు, ఈ మూడు దశల కార్యాచరణను అనుసరించండి మరియు తేడాను గమనించండి.

1) ఛాయిస్ ఇవ్వడం మంచిది!

క్లాస్ లేదా హోం వర్క్ సమయంలో ఏ ఛాప్టర్ లేదా బుక్ ని చదవడానికి ఎంచుకునే స్వేచ్ఛను మీ విద్యార్థులకు ఇవ్వాలి. ఇది ప్రారంభం కాస్తంత కష్టంగానే ఉంటుంది, అయితే విద్యార్ధులు తమ స్వీయ అభ్యసనలో మరింత నిమగ్నమైన తరువాత మీ విద్యార్ధులకు ఇది మరిన్ని ఫలితాలను అందిస్తుంది. పెద్దగా చదవడం అనేది అనేక సంవత్సరాలుగా ప్రయత్నించిన మరియు పరీక్షించిన ఒక విజయవంతమైన విధానం, అందువల్ల దీనిని  మీ లెసన్ ప్లాన్ ల్లో భాగం చేసుకోండి.

2) దీనిని ఒక గ్రూపు కార్యక్రమంగా మార్చండి

రీడింగ్ ను ప్రతివారం చేసే కార్యక్రమంగా మీరు రీడింగ్ క్లబ్ లేదా అలాంటి స్వభావం కలిగిన ఇతర వాటిని ఏర్పాటు చేయవచ్చు, దీనిలో విద్యార్ధులు తాము చదివిన పుస్తకం గురించి లేదా చూసిన మూవీ గురించి మాట్లాడతారు - వారు బాధ్యతాయుతంగా మరియు జవాబుదారీతనంతో ఉండేలా చేస్తుంది. రెగ్యులర్ గా చదవడానికి ఇది ఒక గొప్ప ఇన్సెంటివ్ గా పని చేస్తుంది.

3) విద్యార్థులు చాలా గొప్పగా కథలు చెబుతారు

‘‘యూజర్ లు నిర్ధిష్ట ఆర్టిస్ట్ నుంచి ఆర్ట్ వర్క్ ని ఎంచుకొని, స్టోరీ బుక్ సృష్టించడానికి టెక్ట్స్ జోడించవచ్చు... విద్యార్ధులు ఆన్ లైన్ లో రాయగం అత్యుత్తమ ప్రదేశాలకు సంబంధించిన సైట్ ని నేను జోడిస్తున్నాను. ”

Larry Ferlazzo

టీచర్, రచయిత, బ్లాగర్

మీ విద్యార్ధులు Storybirdతో తమలో ఉండే స్టోరీ టెల్లర్ ని బయటకు తీసుకొని రానివ్వండి. ఇది ఉచితంగా ఉపయోగించుకోగల మరియు ఇంటరాక్టివ్ పిసి టూల్, ఇది మీ విద్యార్ధులు మరింత ఊహాత్మకంగా మారడానికి, అలానే మరింత చదవడానికి మరియు మరిన్ని ఆలోచలనకు దోహదపడుతుదం. ఈ టూల్ లో ఉండే ముఖ్యమైన విషయం ఏమిటంటే, పిల్లలు తమలో ఉండే కథకుడికి బయటకు తీసుకొచ్చేందుకు పూర్తి సృజనాత్మక స్వేచ్ఛని ఇస్తుంది.

మీ క్లాస్ చదివేలా చేయడానికి ఇప్పుడు మీకు ఒక కార్యాచరణ ప్రణాళిక తయారైంది, ఇక వారు స్ఫూర్తిని పొందడం కొరకు కంప్యూటర్ ని ఉపయోగించడం మొదలు పెట్టాలి!